మా పదిహేడు రోజుల ప్రయాణం -2

,,క్ృ.తర్వాత  ఆత్మారాముణ్ని శాంతింపచేసి,ఆశ్రమం వారు మాట్లాడి పెట్టిన వాహనాల్లో రిషికేశ్ బయలు దేరాం.హరిద్వార్ లో ఏ ప్రక్కకు వెళ్ళినా ,గంగే కన్పిస్తుంది.ఎక్కడికక్కడ వంతెనలు.రిషికేశ్ కు గంట లోపే ప్రయాణం .చాలాసేపు నది లాంటి కాలవ ప్రక్కనే ప్రయాణం ,చాలా బాగుంది .రిషీకేశ్ నిండా ఆశ్రమాలే.ఆశ్రమాలంటే పర్ణశాలలు కాదండోయ్!అన్నీ  పక్కా బిల్డింగులే.లక్ష్మణ్ ఝూలా అనే వంతెన మీదుగా గంగను దాటితే ,బోల్డన్ని ఆలయాలు.లక్ష్మణుడి గుడి , కృష్ణుడు గుడి,ఇంకా చాలా చాలా చూసాము.రిషికేశ్ లో rafting బాగా చేస్తారట.అన్నీ పర్వత ప్రాంతాలు అవడం మూలాన్న ఎక్కడికెళ్ళినా,కనీసం 20,30మెట్లు ఎక్కడం ,దిగడం తప్పనిసరి .
అక్కడే భోజనాలు చేసిన తర్వాత ,హరిద్వార్కు తిరుగుప్రయాణం.సాయంత్రానికి హరీకీ పౌరీ అనే ప్రదేశం చేరుకున్నాం,గంగాహారతి చూడటానికి.విపరీతమైన జనప్రవాహం.నాకైతే కాశీలో హారతి బావుంటుందన్పించింది.
హారతి అయిపోయిన తర్వాత , నెమ్మదిగా నడుస్తూ ,జనాలతో కిటకిటలాడుతున్న బజార్లు,షాపులు చూసుకుంటూ రూమ్ కు చేరుకున్నాం.