మా పదిహేడు రోజుల ప్రయాణం _1

దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్  రాష్ట్రం లో గల చార్ధామ్ యాత్ర  చేయాలని , మావారు, స్నేహితులు ,వాళ్ళ కుటుంబాల తో కలసి మొత్తం 17 మందిమి ఢిల్లీ వెళ్ళే తెలంగాణా ఎక్సప్రెస్ ఎక్కాము, సికింద్రాబాద్ స్టేషన్ లో.మర్నాడు ఉదయాన్నే 9_గంటలకు ఢిల్లీ లో ట్రైన్ దిగి ,సుమారు 5గంటలు వెయిటింగ్ హాల్లో నిరీక్షణ.8పైగానే acలు పనిచేస్తున్నా, విపరీతమైన రష్ కారణంగా ,ఢిల్లీ ఎండల్ని ఆ వెయిటింగ్ హాల్లో నే ఎంజాయ్ చేసేసాము.మాతో సహా అందరి దగ్గరా చాలా చాలా లగేజ్.కాలు కదపలేని పరిస్థితి .అతి కష్టం మీద అక్కడ కూర్చుని , మరికాస్త శ్రమతీసుకొని ఆ పద్మవ్యూహం లోంచి బైటపడి , డెహ్రాడూన్ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కాము, మధ్యాహ్నం 3గంటలకు.6గంటల ప్రయాణం తర్వాత ,రాత్రి9గంటలకు హరిద్వార్ లో దిగాము.స్టేషన్కు దగ్గరగా , గంగానది ప్రక్కనే ఉన్న చింతామణి ఆశ్రమం లో బస.ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేశారు , హాయిగా గదుల్లో చేరిపోయాం.పదిహేడు రోజుల్లో ,మొదటి రెండు రోజులు ప్రయాణం చేసి హరిద్వార్ చేరుకున్నామన్నమాట.కొంచెం బోర్ గా ఉందాండీ?తరువాత టపాలో ఫోటోలు పెడతానులేండి.