పునుగుపిల్లి 2

అది నాలుగు పాలచుక్కలు చప్పరించిన తర్వాత  హమ్మయ్య! అనుకున్నా. అప్పుడు మొదలైంది ఇంకో సందేహం ,దీన్ని కేండీ నుంచీ ,ఎండ నుంచీ కాపాడ్డంఎలా? ఎండ  తగలకుండా కుండీ పైన పాతరేకు మూతేసి, రెండు గంటలకొకసారి ,పాలూ నీళ్ళు ,పోసాను.మధ్యలో చీమల బెడద కాస్సేపు .
దానంతట అది కదలుతుందేమోనని చూశాను ,ఊహూ! ఏ మార్పూ లేదు.చీకటి పడిన తరువాత బైట వదిలేస్తే కుక్కలేమైనా లాక్కుపోతాయేమో?ఏం చేయాలో తోచలేదు.ఒకవేళ రాత్రి తల్లి వచ్చి వెతుక్కుంటుందేమోనని, అది ఎక్కడ కనబడిందో,అక్కడే పెట్టడం మంచిదని  కేండీ కంటపడకుండా  అట్టపెట్టె తీసుకుని , స్టోర్ రూం లోకి వెళ్ళి లైట్ వేసాం.తల్లి కోసం మేం చూస్తే ,దాని బ్రదర్స అండ్ సిస్టర్స ఇంకో మూడు కన్పించాయ్.అవి మూడూ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి .చకచకా తిరుగుతూ ,మమ్మల్ని చూసి కంగారుపడి వెళ్ళి పోడానికి దారులు వెతకసాగాయి.అవి వచ్చాయంటే ,ఖచ్చితంగా తల్లి కూడా వస్తుందిలే అని వెనక్కు వచ్చేసి తలుపు మూసేసాం.మిగతా  కథ మరోసారి .ఫోటోలో మూడూ కన్పిస్తున్నాయా మీకు?