క్రొత్త ఆకుకూరలు.

రాష్ట్ర రాజధాని నుండి  మండల కేంద్రమైన మాఊరు ఉండి కి మేం వచ్చేసాక ,ఏమిటో ఇటువైపు చూడడం కుదరడం లేదు .మాకు కావల్సినంత ఖాళీ స్థలం ఉంది . నాలుగు చినుకులు పడేసరికి,పచ్చగడ్డితో పాటు బోలెడన్ని కలుపుమొక్కలు కూడా వచ్చేసాయ్.వాటిలో కొన్నింటిని ఆకుకూరగా వాడుకోవచ్చట.పాలకొల్లు కు దగ్గర్లో ఉన్న చిన్న పల్లె లో పుట్టి పెరిగి , పొలాలు ,తోటలతో కాస్త పరిచయం ఉన్న మా పెదనాన్న గారి కోడలు చెప్తే నాకు నమ్మబుధ్ధి కాలేదు కానీ ఆమె వండుకొని తింటుంటే నమ్మకతప్పలేదు.తెలంగాణా ప్రాంతంలో దొరికే గంగవాయల కూర లాగే ఉండే కలుపు మొక్క ఒకటి దొడ్లో అంతా విస్తరించేసింది,మే నెలలో ఎండల్లో,చుక్క నీళ్లు లేకపోయినా  పెరుగుతుంది  కాబట్టి దాన్ని ,గొడ్డువాయలకూర అంటారట.ఇంకొక కూర పేరు తెలగపిండి కూర అనిఅంటారట.మనం నిత్యం వాడుకొనే అన్ని ఆకుకూరల్లాగానే వీటిని వాడుకోవచ్చట.మొదటి చిత్రం తెలగపిండి కూర. రెండవది గొడ్డువాయల కూర.