మంచు ముసుగు.

మంచు ముసుగేసుకున్న మా ఊరు , మా ఇంటి పరిసరాలు ,చూడండి ఎంత బావున్నాయో! నేను ఫోటోలు ఇంకా సరిగ్గా తీయగలిగితే ఇంకా బావుండేది,అన్పించింది. తెల్లవారుఝామున వర్షం పడినట్లే మంచు కురుస్తుంది, ఆ ముంచు ను ఎంజాయ్ చేస్తూ ,కొంచెం వీరావేశంతో వాకింగ్ చేయడం వలన ,పట్టుకున్న దగ్గు ,జలుబు తగ్గడానికి 20 రోజులు పట్టిందనుకోండి,అది వేరే సంగతి. ఆ మంచు వల్లనే నేమో , హైదరాబాదు లో  నాలుగైదు  పూలు పూసే మా కుండీ లోని గులాబీ ఎన్ని పూలు పూసేసిందో! ఇంక మిగతా ఫోటోల సంగతులు చెప్తున్నానండండి మరి.పోయిన శనివారం మా అబ్బాయి వచ్చి నపుడు, మా ఊరికి దగ్గరగా ఉన్న పేరుపాలెం బీచ్ కు వెళ్ళాం. మాకు చాలా దగ్గర్లోనే ఉన్నా ,మేం వెళ్ళడం ఇదే మొదటిసారి . ఇప్పుడంటే ఇట్లా వీకెండ్ అనీ,సమ్మర్ ట్రిప్ అనీ, ఏదో అప్పుడప్పుడూ ఇలా తిరుగుతున్నాం కానీ,మా చిన్నప్పుడు  ఈ తిరగడాలు ఏవీ లేవు కదా! బీచ్ పొడవునా కొబ్బరిచెట్లతో, చాలా బావుంది , ముఖ్యంగా జనాలు లేనందువలన హాయిగా ఉంది .పర్వదినాల్లో కాస్త రద్దీ ఉంటుందట.మా కేండీ కూడా బాగా ఎంజాయ్ చేసింది.అక్కడకు  అంతర్వేది పది కిలోమీటర్లు ఉంటుంది .అంతర్వేది బీచ్ లోని లైట్ హౌస్ కూడా కన్పిస్తూనే ఉంది దూరంగా .ఆ ట్రిప్ ఇంకోసారి .