మా ఇంట్లో పెళ్ళి సందడి.

బావున్నారాండీ అందరూ? బ్లాగు వ్రాసి చాలా రోజులైపోయింది .కొత్తగా అన్పిస్తుంది వ్రాస్తుంటే.ఇంచుమించు రెండు నెలలుగా ,ఖాళీ దొరక్క ఈఅంతర్జాలం వేపు చూడటం లేదు .తొంగిచూసాననుకోండి,లోపలికొచ్చి మొత్తానికి చూడాలని అన్పిస్తుంది.చదివిన తరువాత కామెంట్ పెట్టాలనిపిస్తుంది.ఈ గొడవంతా ఎందుకు లే అని ,ఈ దరిదాపుల్లోకి రావడం మానేసాను.వ్రాయడం మర్చిపోతానేమోనని ,చిన్న అనుమానం కూడా వచ్చిందండోయ్! అందుకే ఈ టపా .+శుభవార్త కూడా .అమెరికా లో ఉంటున్న మా చిన్నబ్బాయి వివాహం డిశంబర్ 12న  హైదరాబాదు లో జరగుతుంది. ఇంటికి చిన్న చిన్న రిపేర్లు, రంగులు వేయించడం,పనుల్లో పడిపోయాం.నవంబర్ 9న,విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టి ,పసుపు కొట్టి ,లగ్నపత్రికలు వ్రాసుకోవడంతో ,పెళ్ళి ప�నులు మొదలైనవి .ఇప్పుడిక అస్సలు సమయం దొరకదు  �ఇంకో రెండు నెలలు దాకా .అందుకే అందరికీ ఈ పలకరింపు.ఉంటానండీ మరి!