మొక్కజొన్న దోశలు.

వారం రోజుల క్రితం కొన్న మొక్కజొన్న పొత్తుల్ని ఈరోజు టిఫిన్ రూపంలోకి మార్చేసాను.ముదిరిపోయి ,ఎండిపోయిన, వాటిని,నోట్లో వేసుకొని కష్టపడటం కంటే ,రోట్లో వేసి రుబ్బేయడం నయమన్పించింది.[రోలు అంటే మిక్సీ అని మీరు అర్థం చేసుకోవాలంతే.] ఎండినవే కాబట్టి ఒలుచుకోవడం సులువే.రెండు పొత్తుల్ని గింజలు ఒలిచి,రాత్రి నానబెట్టి పొద్దున్నే నాలుగు పచ్చిమిరపకాయలు ,చిన్నఅల్లంముక్క వేసి మెత్తగా రుబ్బేసి,కమ్మదనం కోసం రెండు చెంచాల శనగపిండి,కరుకుదనం కోసం రెండు చెంచాల బియ్యప్పిండి ,రుచి కోసం కాస్త ఉప్పు ,జీలకర్ర వేసుకుని  గరిటజారుగా కలుపుకుంటే మొక్కజొన్నల దోశల పిండి సిధ్ధం.నూనె వేసి కాల్చుకుంటారో,నాన్ స్టిక్ పెనం మీద వేసుకుంటారో ఇక మీ ఇష్టం .ఈ కొలతలతో 5లేదా6 దోశలు అవుతాయి .నిజ్జంగా ఇది నా సొంత ప్రయోగం .మీక్కూడా నచ్చే తీరుతుంది.ప్రయత్నించండి.