మా పెరట్లోని పునాస మామిడికాయలు

ఈ వినాయకచవితికి మా గణపయ్య కు ఉండ్రాళ్ళ తో పాటు ,మామిడికాయ పులిహోర నైవేద్యం.అర్ధమైపోయుంటుంది మీకు ఈపాటికి,మా పెరట్లోని 7సంవత్సరాల వయస్సున్న ఈ మామిడి చెట్టు,4సంవత్సరాల క్రితం నుండీ కాయడం మొదలైంది .సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది.ఈసారి వర్షాలు బాగా పడినందువల్లనో ఏమో బాగా కాసింది. ఏ విధమైన మందులూ,ఎరువులూ వేయము.అక్కడక్కడా ఉండే విడివిడి కాయలు కాకుండా ,ఇట్లాంటి  గుత్తులు చాలా వచ్చాయి .వినాయకచవితి కదా!అందరికీ పంచుతున్నాము.అట్లా ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది కదండీ ! మీ అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు .