మా చిన్నప్పుడు రాఖీ పండుగ కు ఈ హడావిడి ఏమీ ఉండేది కాదు.జంధ్యాలు వేసుకొనే వారు ,పాతవి తీసేసి కొత్తవి వేసుకుంటారని మాత్రం। తెలుసు.పెళ్ళైన తరువాత గోదావరి జిల్లా వదలి ,ఖమ్మం జిల్లా కు వచ్చిన తరువాత తెలిసింది ,ఈ ప్రాతంలో రాఖీపండుగ చాలాబాగాజరుపుకుంటారని.ఇపుడు టీవీ పుణ్యమాని,అన్ని విషయాలు అందరికీ తొందరగా చేరిపోతున్నాయి కదండీ !ఇపుడు మా ఊళ్ళల్లో కూడా,పదిరోజులు ముందుగానే షాపుల్లో రాఖీల సందడి మొదలైపోతుంది.ఆడపిల్లలు చక్కగాముస్తాబై రాఖీలు కట్టడానికి హడావిడి గా ఒకచోటనుండి మరోచోటకు తిరుగుతుంటే చూడముచ్చట గా ఉంటుంది .ఎందుకంటే ఈ పండుగల్లోనే కదా వాళ్ళు చక్కగా పట్టు లంగాల్లో కనిపించేది.అమ్మాయిలు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం పొందుతారు,అన్నదమ్ముల ప్రేమ ఇంకా బహుమతుల రూపంలో।కూడా .నేను కూడా అందుకు మినహాయింపేమీ కాదు లెండి.మా తమ్ముడు గుజరాత్ లో ఉంటాడు.రెండు రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు.చిన్నప్పట్నుంచీ రాఖీ కట్టే అలవాటు లేని కారణంగా, నేను రాఖీ కట్టకపోయినా, ఈ రోజు తను ఊరికివెళ్తూ,నాకు చీర తీసుకోమని డబ్బులిచ్చి వెళ్ళాడు .ఇక మా ఆడపడుచు ఖమ్మం లో ఉంటుంది .ఆమె రావడానికి కుదరకపోయినా,ఏదోరకంగా మా వారికి రాఖీ అందజేస్తుంది.అట్లాగే బహుమతి కూడా నెమ్మదిగానే అందుకుంటుంది.ఇవండీ నా రాఖీ కబుర్లు .చివరిగా మిత్రులందరికీ రాఖీపండుగ శుభాకాంక్షలు .