పంపర పనస కాయ .

ఈ కాయను మీరెప్పుడైనా చూసారా ?పేరు ముందే చెప్పేసాను కదండీ !ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొరకదని అనుకుంటా . గోదావరి .జిల్లాల్లోదొరుకుతుంది . మా ఊరు నుండి మా కజిన్ కూతురు .వస్తూ తీసుకుని వచ్చింది . వాళ్ళింట్లో చెట్టుకు కాసింది .వినాయకచవితి కి పూజలో ఈ కాయ తప్పనిసరి . ఇది బత్తాయి నిమ్మ, నారింజ జాతికి చెందిన ఫలం . తొనలు కొన్ని కాయల్లో తెల్లగా కూడా ఉంటాయి . కొద్దిగా .పులుపు తో కూడిన తీపి తో ఉంటుంది దీని రుచి .పైనుండే తెల్లని పొర మాత్రం చేదుగా తగుల్తుంది .విభిన్నమైన రుచి గల పోషకాల ఫలం .షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా తీసుకోవచ్చునట .