రేపు ఉద్యోగబాధ్యత ల నుండి స్వచ్ఛందపదవీవరమణ చేస్తున్న శ్రీ వారి కి శుభామకాంక్షలు .చెబుతూ ఈ టపా . మావారు దక్షిణ మధ్య రైల్వే ,సికింద్రాబాద్ డివిజన్,సంచాలన్ భవన్ లో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో చీఫ్ కంట్రోలర్ గా పని చేస్తూ ఉంటారు .ఆయన 21సంవత్సరాల వయసులో ఉద్యోగం లో చేరారు 33సంవత్సరాల సర్వీస్ అయ్యింది .ఇంకా6సంవత్సరాలు ఉంది . ఉద్యోగ బాధ్యత లు కొంచెం కష్టం .గానే ఉంటాయి . షిఫ్ట డ్యూటీస్ .వారంలో3రోజులు రాత్రి .డ్యూటీ .పని ఒత్తిడి .ఎక్కువే .అట్లా అని విధినిర్వహణ లో ఏమీ రాజీపడరు .సర్వీస్ అంతా పూర్తి స్థాయిలో కష్టపడి సంతృప్తి కరంగా పని చేసారు . ఇది .ఇంకా .ఇట్లాగే చేస్తూ ఉంటే ,ఆరోగ్యం దెబ్బ తింటుందని,ముందు జాగ్రత్తగా పదవీవిరమణ నిర్ణయం తీసుకున్నారు .ఉత్తమ పనితీరుకు,రైల్వే వారిచ్చే అవార్డు ఆయనకు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది . మిథునం సినిమా లో బాలు గారు చెప్పినట్టు ఈ రోజుల్లో .అందరికీ బిపి సుగర్ ,రెండు ఆభరణాల్లాగా తప్పనిసరిగా ఉంటున్నాయి . దేవుడి దయవలన మాకు రాలేదనుకోండీ .సాధ్యమైనంత .వరకూ వాటికి దూరంగా ఉండాలని ఈ జాగ్రత్తలు . ఆరోగ్యమే మహాభాగ్యం కదా! పదవీ వరమణ అనంతరం ఆయన తన జీవితం తాను కోరుకున్న రీతిలో ,చైతన్యవంతంగా,ఆరోగ్యంగా,ఆనందంగా గడపాలని,నేను,మా అబ్బాయి లిద్దరూ,మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాము .