'గూడు గుడ్డు పిట్ట ,రిపీట్' అని,జూలై 27న నేను పెట్టిన టపాకు ,కొనసాగింపు, ఇంకా ముగింపు కుడా ఈటపా . పిట్ట ఈసారి గుడ్లు పెట్టిన దగ్గరనుండీ ఒకటే వర్షాలు . వేడి తక్కువ అయినండువల్లనో ఏమో,గుడ్ల లోనుండి పిల్లలు బైటకు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది . ఇంచుమించుగా 20రోజులు . వర్షానికి గూడు తడవకుండా ప్లాస్టిక్ కాగితాలు అడ్డం పెట్టాను కుడా !పిల్లలు బైటకు వచ్చాక ,త్వర త్వరగా ఎదిగాయి. ఈ రోజు ఉదయమే బైటకు వచ్చేసాయి . బైటకు వచ్చాక అన్నింటినీ కలిపి , గ్రూప్ ఫోటో తీయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అవి . ఎదగడానికి తొందర పడ్డట్టే ,ఎగరడానికి కూడా చాలా తొందరపడిపోయి, చక్కగా ఎగిరిపోయాయి . ఇంక ఏం చేస్తాను ?విడివిడిగానే తీశాను, ఫోటోలు . చూడండి మరి!