double quota

ఇంకో గంటలో బ్లాగులు ,రేపు తెల్లారేసరికల్లా పేపర్లు తెలంగాణ  వార్తలతో నిండిపోతాయి . తెలంగాణా వాదుల సంబరాలకు అంతేలేదు. బోనాలు జరుగుతున్న సమయంలో వారికిది అమ్మవారు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. .
 టీవీ లో వార్తలు చూడడంలో అందరూ బిజీ గా  ఉన్నారు. మా మల్కాజ్గిరి లో మంచి నీళ్ళు ఆరు రోజులకొకసారి వస్తాయండీ! ఈ రోజు ఉదయం నీళ్ళు వచ్చేసాయి, పట్టేసుకున్నాం కూడా  .  మరలా సాయంత్రం ఆరు  గంటలకు నీళ్ళు వదిలాడు, ఇదేమిటీ ?మళ్ళీ వస్తున్నాయీ ?అనుకుంటుంటే మావారు అంటున్నారు కదా!'ఉదయం వదిలినవి తెలంగాణా వాళ్ళకు , సాయత్రం వదిలినవి ఆంధ్రా వాళ్ళకు  అని'. ఏమిటో ఒక్క నిమిషం ఎట్లాగో అన్పించిది. రేపట్నుంచీ అన్నీ ఇంతేకదా !అలవాటు పడిపోతామనుకొండీ. అది వేరే సంగతి . కొన్నాళ్ళు కొత్త కొత్తగా ఉంటుందేమో మరి !చూద్దాం . .
.