ఏదైనా సలహా చెప్పండి .

చెట్లు పెంచడంలో ఆసక్తి ఉన్న బ్లాగు మిత్రులు ఎవరైనా నా యొక్క ఈ సమస్య కు ఏదైనా సలహా చెబుతారని ఆశిస్తున్నాను . మా ఇంట్లో ఏడు సంవత్సరాల వయసు గల రెండు మల్లె చెట్లున్నాయి .అవి సరిగ్గా పూలు పూయడం లేదు . ఏ విధమైన పోషణ చేయాలి తెలియడంలేదు .ఏటా ఫిబ్రవరి లో ఆకు మొత్తం ఒక్కటి కూడా లేకుండా తీసేస్తున్నాము .ఆకు దూసిన త�రువాత నీళ్ళు ఎక్కువ పెట్టకూడదని ఎవరో చెప్పారు . ఆ ప్రయత్నం కూడ � అయ్యింది . ఏ�మీ గొప్ప ఫలితాలు రాలేదు .ఒకదానికి బాగా నీళ్ళు పెట్టి ,ఒకదానికి తగుమాత్రంగా పోసి చూసాను .ప్రయోజనం శూన్యం . సీజన్ మొత్తానికి ఒక వారం రోజులు 50నుండి100 పూలు పూసి ఆగిపోయింది . ఈమాత్రం దానికి గంటలు గంటలు కష్టపడి ,చేతులు నొప్పెట్టేలా ఆకు తీయడం వృధా అన్పిస్తుంది .మేము ఏ విధమైన ఎరువులు,రసాయనాలూ వాడటంలేదు .వాటి అవసరం లేకుండానే ,సన్నజాజి,విరజాజి విరగబూస్తున్నాయి .నేను వాటిని బ్లాగు లో కూడా పెట్టాను . వాటి లాగే మల్లెలు కూడా పూయాలని ఆశ .చెట్లు ఎప్పుడూ దట్టంగా ఆకులతో కళకళలాడిపోతుంటాయండీ,పూలు మాత్రం .సరిగా రావు .ఇప్పుడు సీజన్ అయిపోయింది ,అయినా విషయం తెలుసుకొని వచ్చే సంవత్సరం ప్రయత్నం చేద్దామని  నా ఉద్దేశ్యం .