సన్నజాజులోయ్!

మా పెరట్లోని సన్నజాజి ,విరజాజి డాబా మీద ఎట్లా విరగబూసాయో చూడండి . బుట్టలోవి విరజాజులండీ .చెట్టు నిండుగా పూసినవేమో సన్నజాజులు .వాటిని చెట్టు .నుండి బుట్టలోకి చేర్చడం నా వల్ల  కాక వదిలేసాను .ఎటూ వదిలేసాను కదా అని పొద్దున్నే డాబా పైకెక్కి ఫోటో .తీసాను ,మీ అందరికీ చూపిస్తే ఓ పనైపోతుంది కదాఅని!పూలంటే ఎంత ఇష్టమైనా రోజూ తెంపాలంటే విసుగే కదండీ . మొగ్గలు కుంకుమరంగులో ఉండి చక్రాల్లా పెద్దగా ఉన్నవేమో, సెంటుజాజి . ఇక ఎర్రగా ఉన్నవేమో కాశీరత్నాలు   ..అవి చాలా నాజూకండీ .చెట్టు మీద ఉన్నంతసేపే వాటి అందం .త్వరగా వాడిపోతాయి డైటింగ్ చేసే అమ్మాయి లాగా .
.