హమ్మయ్య ! పిట్టపిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయోచ్!

పదిహేను రోజులుగా మాకు మంచి కాలక్షేపం కలగచేసిందండీ,మా పెరట్�లోని పిట్టగూడు .ఇవ్వాల్టితో కథ సుఖాంతమైపోయింది .ఈరోజు ఉదయం మూడు పిట్టలు బైటకు వచ్చి కిందా మీదా పడుతూ లేస్తూ,చివరకు హాయిగా గాల్లోకి ఎగిరిపోయాయి .ఒకటి మాత్రం కొంచెం బలహీనంగా ఉంది . ఇంకా ఎగరలేకపోతుంది . ప్రయత్నం చేస్తుంది ,కానీ పడిపోతుంది . తల్లి దానికి ఇంకా ఆహారం పెడుతూనే ఉంది .మేము .అది ఎట్లా ఉందో చూద్దామని దగ్గరకువెడితే అరచి అరచి గోల చేస్తుంది . దాని పిల్లను ఏం చేసేస్తామోనని దాని భయం . ఈరోజు ఉదయం వాటిని చూస్తూ బాగా .ఎంజాయ్ చేసాము .మరలా  రాదు కదా!అలాంటి అవకాశం . రోజూ వాటిని .ఉదయాన్నే లేచి చూసి నాలుగూక్షేమంగానే ఉన్నాయని,హమ్మయ్య!అనుకోవడం ఎందుకంటే రాత్రి .పూట ఏ పిల్లైనా వాటిని భోంచేసేసిందేమోనని,భయం .మన ఎదురుగా అట్లా జరిగితే .బాధ కదండీ!ఉదయాన్నే .లేచి చూస్తే ఎప్పటిలాగానే నాలుగూ ఒకదానిమీద ఒకటి పడుకొనే ఉన్నాయి ,సర్దుకుపోదాం రండి!అన్నట్లుగా  .అరగంట తర్వాత వచ్చి చూస్తే మూడు పిల్లలు ఒకే కొమ్మ మీద పక్క పక్కనే చాలా ముద్దుగా ,బుధ్ధిగా కూర్చుని ఉన్నాయి ,మీరూ చూడండి . అక్కడి నుండి మొదలు .అవి ఎగరడానికి ప్రయత్నం చేయడం ,పడిపోవడం .కేండీ వచ్చి .ఎక్కడ పట్టుకొంటుందోనని మా భయం . మేము .వాటిని .తీసి గూట్లో పెడుతుంటే వాటి తల్లి గోల .వచ్చీరాని నడకతో పడిపోయి దెబ్బలు తగిలించుకునే చంటిపిల్లల మాదిరిగా ,అవి కష్టపడి .ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు మారుతూ ,అక్కడ విశ్రాంతితీసుకుని నెమ్మదిగా .అలా అలా ఎగిరిపోయాయి .

Labels: