పిట్ట పిల్లలు బయటకు వచ్చేసాయి .

ఇందుమూలముగా మీకందరికీ తెలియచేయునదేమనగా మా పెరట్లో నారింజ చెట్టుకు ,గూడు కట్టి ,నాలుగు గుడ్లు పెట్టిందో బుజ్జిపిట్ట .గుడ్లు చూపాను మీకు  గత టపాలో . పిల్లలని కూడా చూపిస్తానని మాట ఇచ్చాను మీకు .హమ్మయ్య! నా మాట నిలుపుకొని పిట్ట పిల్లల్ని మీ ముందు పెట్టేశా!చూసేయండి గుడ్లు పెట్టిన వారం రోజులకు పిల్లలు కనిపించాయి .కానీ పాపం !వెంటనే ఫోటో తిీయడానికి మనసొప్పలేదు .5రోజులు అయిన తరువాత తీసాము .ఈలోపు గట్టిగా గాలి వీచినా,వర్షం పడినా,అవి ఎక్కడ క్రింద పడిపోతాయేమోని భయం . రోజులో నాలుగైదు సార్లు వాటిని చూడటం,అదీ తల్లి లేని సమయంలో . అలికిడి అయితే చాలు ఆహారం కోసమేమో మరి నోరు ఎట్లా తెరుస్తున్నాయో చూసారుగా!వాటి తల్లిదండ్రులకు ఇంక అదే పని   .ఆహారం ముక్కున కరుచుకొని తెస్తూనే ఉంటాయి ,పెడుతూనే ఉంటాయి . ఇంకొక 4రోజుల్లో రెక్కలొచ్చి ఎగిరిపోతాయనుకుంటున్నాము .మా కేండీ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళకుండా కాపలా కాస్తున్నాను .పాపం అది గూడు తక్కువ ఎత్తులో కట్టింది .అందుకే ఫోటోలు బాగా తీసేసాం .ఏమైతేనేం! పది రోజులుగా మాకు మంచి కాలక్షేపం .
.