హమ్మయ్య!ఎలాగయితేనేం,మొత్తానికి కష్టపడి బుజ్జిపిట్టను ఫోటో లో బంధించేశానండీ .మూసిఉన్న కిటికీ తలుపు నలుపు రంగు అద్దం లో దాని ప్రతిబింబాన్ని చూసుకుంటూ ముక్కు తోపొడుస్తూ ఉంది ఉదయాన్నే . నేను లోపలి నుండీ ఫోటో తీసాను .పాపం దానికి నేను కనపడను కదా ! ఇక దాని పిల్లలను మీకు చూపడమే మిగిలింది . అందరం వేచి ఉండాలి . ఎన్నిరోజులు పడుతుందో తెలియదు . ఇప్పటికే మేము చూసి గుడ్లు చూసి ఆరు రోజులు అయ్యింది .