మా వాకిట్లో నారింజచెట్టు కొమ్మల్లో చిన్న పిట్ట కట్టిన గూడు చూడండి .ఎంత బావుందో! పక్షి గూడు చూసినప్పుడల్లా దాని నైపుణ్యం చూసి,అది దానికి ఎలా సాధ్యం అవుతుందా అనిపిస్తుంది . ఆ పిట్ట పరిమాణంలో పిచ్చుక కన్నా చాలా చిన్నగా ఉంది . చాలా రోజులుగా దానిని ఫోటో తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను .అది నాకు .కుదరడం లేదు . ఇప్పుడు దాని ఇల్లు తీసాను .భవిష్యత్తులో దాన్ని పిల్లల్ని కూడా చూపిస్తాను .పిట్ట చిన్నదే కానీ గుడ్లు మాత్రం చిన్న చిన్న రేగుపండ్ల లాగా ఉన్నాయి . ఈ పిట్ట ఇంటి అడ్రస్ కనిపెట్టింది మాత్రం నేను కాదండీ! మా వారు