మీ ఇంట్లో మీరే చేసేసుకోండి . దాల్ మిక్శ్చర్ .

బజారులో దొరికేవాటికన్నా,రుచిగా  ఉంటుంది ,ఎందుకంటే ఉప్పు కారం మన ఇష్టప్రకారం వేసుకుంటాం కాబట్టి . సోయాగింజలు,బొబ్బర్లు,పెసలు,పచ్చిశనగపప్పు,పచ్చిబఠానీలు,అన్నీ సమాన కొలతలో తీసుకుని ,విడివిడిగా,4గంటలపాటు నానబెట్టుకోవాలి .అన్నింటినీ విడి విడిగానే నీళ్ళు వాడ్చి 5నిముషాలపాటు ఆరనివ్వండి .గింజలు మునిగేటంత నూనె కళాయిలో పోసి వే�డెక్కిన త�రువాత అన్నీ విడివిడిగా మంట మధ్యస్థంగా పెట్టి వేయించుకోవాలి .సరిగా నానని గింజలేమైనా ఉంటే కాస్త చిటపటలాడే అవకాశం .ఉంటుంది . అందుకే ముందు జాగ్రత్తగా గింజలు కాగే నూనెలో వేయగానే2నిముషాలు మూతపెట్టేసి ,చిటపటలు తగ్గాక,మూత తీసి దోరగా వేయించుకోండి .అన్నీ వేయించడం పూర్తయ్యాక ,మీ ఓపిక ను బట్టి జీడిపప్పు,మీ రుచిని బట్టి కరివేపాకు కూడా .వేయించుకొని,అన్నీ కలిపేయండిక .ఆఖరుగా ఉప్పు కారం, ఆమ్చూర్ పొడి వేసి ,కరివేపాకు పొడి అయ్యేలా ,అన్నీ,బాగా కలుపుకుంటే,దాల్ మిక్చర్ తయారు .గాలి తగలకుండా నిల్వ చేయండి  మరి .