ఇవీ మావే! కాస్త .చూడండి .

ఇవన్నీ మాఇంటి చుట్టూ ఉన్న కాస్త .స్థలం లో మేం పెంచుకుంటున్న మొక్కలకు పూసిన పూలు .ఉదయాన్నే వాటన్నిటినీ ఒకసారి పలకరించకపోతే ఏదో మిస్ అయినట్లు ఉంటుంది . పూజ కోసం  తెంపే నెపంతో వాటి�ని చేతిలోకి తీసుకుంటే ఏదో మెత్తటి అనుభూతి ,పసిపిల్లలను తాకినట్లుగా . సన్నజాజులు విరజాజులు .కోసి మాల కట్టి మా బొజ్జగణపయ్యకు  వేయాల్సిందే ఆయన వాటా పోనూ మిగిలినవి ఇరుగు పొరుగుకు  .  ఈసారి మండిన ఎండల్ని మనుషుల మే తట్టుకో�లేకపోయాము .బకెట్ల కొద్దీ నీళ్ళు పోసినా నీరసించిపోయాయి .ఈ వర్షాలకు కాస్త .ఊపిరి పోసుకొని దేవుడి కి పూలిచ్చే పనిలో పడ్డాయి .

                                                                                 గులాబి
పారిజాతం
మందార
కరవీర
మద్రాస్ కనకాంబరం
పేరు తెలియదు
నూరువరహాలు
పేరు తెలియదు
కనకాంబరం
చుక్కమల్లి
విష్ణువర్ధనం
విరజాజులు
సన్నజాజి
పేరు తెలియదు
సువర్ణ గన్నేరు
నందివర్ధనం