మొగలి పూవు .

ఈ ఫోటో ల్లో ఉన్నది మొగలిపూవు .పల్లెటూరు లో పుట్టి పెరిగిన వారికి ఈ సంగతి తెలుసు ,కానీ ,నగరవాసులకు తలియకపోవచ్చు,అనుకుంటున్నాను .నగరాల్లో ఉండే బ్లాగు మిత్రులకు,దీన్ని పరిచయం చేద్దామని నా ప్రయత్నం . ఈ మధ్య మాఊరు ఉండి వెళ్ళి వచ్చాం . అక్కడి నుండి తెచ్చాను .ఈపూవు ఇంట్లో ఉంటే ఇల్లంతా సువాసనాభరితం .సహజసిధ్ధమైన రూమ్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది .పైన ఉండే రేకులు బిరుసుగా ముళ్ళతో ఉంటాయి కానీ లోపల రేకులు మృదువుగా మంచి సువాసనతో ఉంటాయి . ఈరేకుల్ని విడిగా తీసి చిన్న చిన్న రింగులుగా చుట్టి పూలజడ కుడతారు .ఈపూవు మొత్తం అట్లాగే బట్టల బీరువాలో పెడితే ,సువాసన బట్టలకు పడుతుంది . నేను అందుకే తెచ్చాను మరి .
"విరిసే విరిసే మొగలిరేకులు"అని సీరియల్ టైటిల్ సాంగ్ విన్నారు కదా!ఇపుడు మొగలిపూవును కూడా చూసేశారు .వాసన చూపించడం మాత్రం నాకు వీలుకాదు కదండీ!సారీ!