సినిమాలే లేవా?

మేము సినిమాలు చూడటం చాలా తక్కువ . ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూస్ చాలా బాగుందని వస్తేనో, లేదా  చూసిన వాళ్ళు, "చాలా బాగుంది  వెళ్లి చూసి రండి ."అని చెబితెనొ , వెళ్ళడానికి ధైర్యం చెస్తామ్.
                ఈ రోజెందుకో ఖాళీగా ఉండి  ఏమీ తోచక సినిమాకు వెడదామని అన్పించి  పేపర్ చేతిలోకి తీసుకున్నాను. నగరం లో ఎక్కడెక్కడ, ఏమేమి సినిమాలు, ఆడుతున్నాయో చూద్దామని. తెలుగు సినిమాల జాబితా లో పేర్లన్నీ చదువుతుంటేనే భయం వేసి సినిమా ఆలోచనే విరమించుకున్నాము.
              లవ్ టచ్
             లవ్  సైకిల్
              తడా ఖా
             మిడత
    పైన వ్రాసినవి మచ్చుకు కొన్ని మాత్రమె. ఇంకా కొన్ని డబ్బింగ్ చిత్రాలు,
ప్రేమ కధలు పెద్ద వాళ్ళం కూడా చూసేలా తీస్తే పిల్లలు చూడరా? ప్రేమ కధకు కుటుంబం ,దానితో అనుబంధాలు ,గురించి తీసిన సినిమాలు, ఎన్నో విజయ వంతమైనాయి. పది సంవత్సరాల క్రిందట తీసిన కొన్ని సినిమాలు ఇప్పటికీ టీవీ లో వస్తే మిస్ అవ్వకుండా చూస్తాము. ఎందుకని? వాటిలో అన్నీ సమ పాళ్ళల్లోఉంటాయి  కనుక   విసుగు అన్పించదు . ఇప్పటి వాటిల్లో కధ తప్ప మిగతావన్నీ ఎక్కువే .
          ఈ మధ్యన గ్రాఫిక్స్ ఎక్కువగా పెట్టి తీసిన సినిమాలు కధ  తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయగలిగాము . మన వాళ్ళేనా ఇంత బాగా తీసింది !అనుకున్నాము. అలాంటివీ, మంచి కుటుంబ కధ  ఉన్న చిత్రాలు ,రావాలి. అవి లేకనే" ,పెద్ద వాళ్ళు మాకు చూట్టానికి ,సినిమాలే లెవు. " అనుకొనే పరిస్తితి  వచ్చింది