candy vs love birds:

మా ఇంటికి ఈ రోజు కొత్త అతిధులు వచ్చారు , వారి  రాక మా ఇంట్లో ఒకరికి, అస్సలు నచ్చడం లేదు . వచ్చిన వాళ్ళను తిరిగి పంపించలేము కదా! ఈ పాటికి మీకు అర్ధం అయ్యే ఉంటుంది ,candy  vs love birds అంటే ఏమిటో .
నా పాత టపాలు చూసిన వారికి తెలిసే ఉంటుంది . candy అంటే మా పెంపుడు కుక్క అనడం కన్నా, family member
అనాలి. ఇంట్లో దానిదే రాజ్యం . అందుకే పక్షుల్ని తీసికోనిరావడం దానికి అస్సలు ఇష్టం లెదు.
          రెండు రోజుల క్రితం ఆఫీస్ నుండి వస్తూ మావారు రెండు love birds తీసికొని వచ్చారు . మిట్ట మధ్యాహ్నం ఎండలో పెట్టి వాటిని అమ్ముతుంటే జాలి అన్పించి తీసుకోన్నారట . ఈ ఎండలకు మనమే తట్టుకోలేక పోతున్నాం . ఇంట్లో కాస్త  నీడలో పెట్టవచ్చు ,అని అనుకున్నారట .
         ఇక చూడాలి దాని అరుపులు . మేం వాటి దగ్గరకు ,వెడితే చాలు అరవడం మొదలు . వాటిని పలకరిస్తే దీనికి కోపం . కుక్క కు కోపమేమిటి ? అనుకుంటున్నారా? దానికి అన్నీ అర్ధం అవుతాయండీ! అది లేకుండా చూసి వాటిని పలకరించాల్సివస్తుంది . అది లేనపుడే వాటికి నీరు ,మేత పెట్టడం . చిన్న చిన్న పిట్టలు, ముద్దుగా ఉన్నాయ్.మొదటి రోజు ఈ అరుపులకు భయపడి, పంజరానికి అతక్కుపోయాయి . ఇపుడు చక్కగా అరుస్తూ ఒకదాన్ని ఒకటి ముక్కులతో పొడుచుకుంటూ ఆడుకుంటున్నాయి .
           కానీ candy మాత్రం వాటి ఉనికిని అస్సలు సహించడం లేదు . గంటకొకసారి వాటి దగ్గరకు వెళ్లి పైకి చూసి అరుస్తుంది . అవి వచ్చిన దగ్గరనుండీ పాపం ఇది సరిగా నిద్ర కూడా పోవడం లెదు. ఇంట్లో మాతో పాటుగా అది మాత్రమె ఉండాలని దాని ఉద్దెశ్యమేమో మరి. రెండు రోజులు అయితే అదే అలవాటు పడుతుంది  .అనుకుంటున్నాము చూడాలి మరి! అప్పటికీ అది ఒప్పుకోకపోతే ఏమి చెయ్యాలో ఆలోచించాలి మరి!    ,