చిట్కా :



          నాకుఉన్న  ఆవగింజంత ఆరోగ్య స్పృహ కారణంగా ఆహరం విషయం లో ,బుల్లి తెరపైన, పుస్తకాల్లోనూ పోషకాహార నిపుణులు చెప్పే ,సలహాలు ,సూచనలు, అనుసరించడానికి, ప్రయత్నిస్తుంటాను. పాలిష్ పట్టని బ్రౌన్ రైస్ తింటే మంచిదని విని, అవి తెచ్చుకొని, తినడానికి ప్రయత్నిస్తున్నా. కానీ చిన్నప్పట్నుంచీ తెల్ల బియ్యం అలవాటై పోయి ఇవి తినడం, కొంచం కష్టం గానే, ఉంటుంది. 1:1 నిష్పత్తి లో బ్రౌన్ రైస్ ,వైట్ రైస్ ,కలిపి వండి చూసానండి.తినడానికి చాలా బాగుంది, తినడానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, ఇపుడు రోజూ తినగల్గుతున్నాం. మీరు కూడా ప్రయత్నించి చూడండి. చక్కటి ఆరోగ్యం, మీదౌతుంది.