కాలం  తో పాటు మారుతున్న నా కాలక్షేపాలు.
                అప్పుడు ,ఇప్పుడు,ఎప్పుడూ, పుస్తకాలు చదవడమంటే ఇష్టం.అలా అని ఎదో పెద్ద పెద్ద సాహిత్యాలు, కవిత్వాలు, కాదు. ఏదో కాలక్షేపానికి, దినపత్రికలు, వారపత్రికలు, అపుడపుడు నవలలు.
        చదవడం తో పాటుగా ఆయా రోజుల్లో జనాలందరూ, అనుసరించే, ఏదో ఒక హాబీ .ఉదాహరణకు, కొన్ని రోజులు ప్లాస్టిక్ వైర్ తో బుట్టలు అల్లడం.తరువాత,ఊలు తో లేసు తో బొమ్మలు,టేబుల్ క్లాత్లు మొదలైనవి కుట్టడం .కొన్ని సంవత్సరాలు వాటితో గడచింది.
           తరువాత చేతికుట్ల తో వాల్ హాన్గింగ్స్ కర్తెన్స్ కొన్నాళ్ళు. తరువాత ఏకంగా చీరలు కుట్టడం. ఒక్కో చీర కుట్టడం పూర్తయ్యేసరికి, 5 లేదా 6 నెలలు పట్టేది. స్వంతానికి, కొన్ని, తెలిసినవాళ్ళకు కొన్ని.అట్లా   ఆ
మోజు తో కొన్ని సంవత్సరాలు గడిచాయి .ప్రస్తుతం ఆ వేలంవేరి తగ్గింది.
టీవీ  చూడటం పెద్దగా ఆసక్తి లేని కారణంగా ఖాళి  సమయాల్లో తెలుగు బ్లాగులు చూడడం మొదలు పెట్టాను. ఇపుడు అదే నాకు పెద్ద టైం పాస్ అయింది.అన్నీ ఇపుడిపుడే నేర్చుకునే ప్రారంభ స్తితి లో ఉండడం వలన దిని కోసం చాలాసమయమే వెచిస్తున్నాను.పోను పోను సులభమవుతుందని అనుకుంటున్నాను.కొంచం అనుభవం వస్తే ఇంకొంచం  పెద్ద బ్లాగ్ వ్రాయగలనని అనుకుంటున్నాను.