అమ్మ ఆశ్రమం:
ఆనంద బుద్ధ విహార:
సికింద్రాబాద్ దగ్గరలోని ఈస్ట్ మారేడుపల్లి రోడ్ లో ఉన్న"" మహేంద్ర హిల్స్ " కొండ పై ఉన్నాయి, ఈ రెండు ప్రదేశాలు. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్నామేము ఎపుడూ వెళ్ళలేదు.
ఊరి నుండి వచ్చిన మా అమ్మ ,అమ్మమ్మ లను, తీసికొని ఒకరోజు బయలుదేరాము. ముందుగా మాతా అమృతానందమయి ఆశ్రమం దగ్గరకు వెళ్ళాము. ఆశ్రమం ఆధ్వర్యం లో స్కూల్ హాస్పిటల్ ఇంకా వివిధ సేవాకార్యక్రమాలు ,నడుస్తాయి .ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, పూజలు, బాగా జరుగుతాయి. అమ్మ వచ్చినపుడు, చాలా రద్దీగా ఉంటుందని, నిర్వాహకులు తెలియచేసారు. ఇక్కడకు, దగ్గరలోనే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కూడా ఉంది, కాలనీ అంతా పెద్ద పెద్ద, భవనాలతో చక్కటి రోడ్ల తో బాగున్నది.
అమ్మ ఆశ్రమంలో ముఖ్యంగా చూడవలసినది, పరమ శివుని కుటుంబం ,మొత్తం ఒక్క పీఠంపై కొలువుతీరిన ఆలయం. ఆశ్రమం, గేటు లోనుండి, లోపలకు వెళ్ళగానే ,ఎదురుగా కన్పిస్తుంది. ఈ గుడికి, నాలుగు వైపులా ద్వారాలు, ఉన్నాయి. మొదట అమ్మవారి దర్శనం, అవుతుంది. అక్కడనుండి, మనం, ప్రదక్షిణ చేస్తూ వెడితే, మిగిలిన ముగ్గురూ దర్శన మిస్తారు. అమ్మవారికి, సరిగ్గా వెనకవైపు, పరమ శివుడు, కుడి, ఎడమలలో వినాయకుడు,కార్తికేయుడు, ఉంటారు.లోపలి, కి ప్రవేశం లేదు. నాలుగు వైపులా ఉన్న, ద్వారాల నుండి దర్శనం, చేసుకున్నాము. ఇట్లా నలుగురూ, ఒకే పీఠం పై ఉండటం, ఇంతకూ ముందు, ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.
అక్కడి నుండి, తిరిగి వస్తుంటే ఎవరో చెప్పారు."వెనుక రోడ్ లో బుద్ధుని, మందిరం ఉంది చూసి వెళ్ళండి. చాల బాగుంటుంది."అని.వారి మాట ప్రకారమే వెళ్ళాము. దగ్గరలోనే ఉంది,చాలా ఎత్తు లో ఉంది.ఒక 100 కు పైగా మెట్లు ఉన్నాయి. మా అమ్మమ్మ ఎక్కుతుందా ?అని మేము అలోచిస్తున్నంత లోనే, ఆమె ఎక్కడం మొదలుపెట్టింది. 80 సంవత్సరములు, దాటినా ఆమెకు గుడి అంటే చాలు ఎంత కష్టమైనా సరే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అట్లా అట్లా ఆమె కోసం ఆగుతూ, నెమ్మదిగా ఎక్కుతూ, పైకి చేరాము. పైకి చేరి చుట్టూ చూస్తె పడ్డ శ్రమ ఆoతా మర్చిపోయాము. జంట నగరాలు మొత్తం
అక్కడి నుండి కన్పిస్తున్నాయి. కిక్కిరిసిపోయిన బొమ్మరిల్లు ల్లాంటి, ఇళ్లు ,నగరం మొత్తం, అక్కడక్కడా విస్తరించిన, కంటోన్మెంట్ పరిధిలోని, పెద్ద పెద్ద చెట్లు వలన ,పరచుకున్న పచ్చదనం తో, చూడడానికి, చాల బాగుంది. దగ్గరలో ఉన్న, సికింద్రాబాద్ స్టేషన్ తో పాటు, దూరంలో ఉన్న హైటెక్ సిటీ కూడా చక్కగా
కన్పిస్తుంది. తరవాత మందిరం లోపలకు, వెళ్ళాము. ఎదురుగ ధ్యాన ముద్ర లో కూర్చొని ఉన్న పెద్ద బుద్ధ విగ్రహం. చూస్తుంటే చాలా ప్రశాంతంగా అన్పించింది. చాలా విశాలం గాఉంది. తివాచి పరచుకొని కూర్చొని, ధ్యానం, చేసుకోవచ్చు. హాలు చుట్టూరా గోడల పైన బుద్ధుని కి సంభందించిన, చిత్రాలు, ఉన్నాయి.
నిశ్శబ్దం, అమలుచేయాలనీ ,బోర్డు ల ద్వారా సూచించారు.మనకు తోచిన విరాళం హుండీ, లో వేయవచ్చు. బయట త్రాగు నీటి సౌకర్యం ఉన్నది.
ఇది కట్టి 6 సంవత్సరాలు, అయింది. జనసమ్మర్ధం ఎక్కువగా లేనందువలన, చాల ప్రశాంతం గా, ఉంది. కాసేపు అక్కడ కూర్చొని, తిరిగి బయల్దేరాము. సగం మెట్లు దిగిన తరువాత క్రింద ఒక ప్రక్కన
ఆఫీసు రూం ఉన్నది. దాంట్లోనే లైబ్రరి కూడా ఉన్నది.అక్కడ బౌద్ధ మతానికి, సంభందించిన పుస్తకాలు,
ఉన్నాయి. వాటి మీద ధర ముద్రించి లేదు. మనకు, తోచిన విరాళం ఇస్తే రసీదు, పుస్తకం, మన సొంతం. మనమిచ్చిన డబ్బుకు, రసీదు ఇచ్చారు. అట్లా మేము కొన్ని పుస్తకాలు తీసికున్నాము. మిగతా సగం మెట్లు, దిగి క్రిందకు, చేరుకున్నాము. ఒక మంచి, ప్రశాంతమైన, ప్రదేశాన్ని, చూసామని, సంతోషించాము,
తెలిసిన వారందరికీ చెబుతున్నాము."వెళ్లి చూసి రండి" అని. మరి మీరెప్పుడు చూస్తారు? తప్పక చూడండి.