వాము అన్నము:

వాము అన్నము. రాత్రి మిగిలిన అన్నం తో చేసిన నిమ్మకాయపులిహోర తినీతినీ,విసుగు అన్పిస్తే ఒకసారి ఈ వాము అన్నం ప్రయత్నించి చూడండి. కావలసినవి. మినపప్పు ఆవాలు వాము ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు ఇంగువ నూనె ఉప్పు అన్నం పైన చెప్పిన తాలింపు దినుసులన్నీ మనం తీసుకొనే అన్నానికి సరిపోను తీసుకొవాలి. అన్నం విడివిడిగా చిదుపుకొని సరిపడా ఉప్పు ,ఒక చెంచా నూనె వేసుకొని బాగా కలుపుకొవాలి. నూనె వేడి చేసి పల్లీలు,మినపప్పు,ఆవాలు,కొంచెం ఎక్కువ మోతాదులో వాము,ఎండుమిర్చి,కరివేపాకు ఇంగువ,వరుసగా వేసి దోరగా వేగిన తరువాత, అన్నం లో వేసి,కరివేపాకు,ఎండుమిర్చి చేత్తో నలిపి తాలింపు అంతా అన్నంతో బాగా కలిపితే,జీర్ణశక్తికి బాగా ఉపయోగపడే ,వాము అన్నం తయారు. చేసి చూడండి.