మాఊరు

ఇది  మా ఊరు "ఉండి "
పశ్చిమ గోదావరి జిల్లా లో ఉంది .
చూసారుగా మా ఊరిలోని  పచ్చని పొలాలు.
చిన్న తిరుపతి గా పిలవబడే ద్వారకాతిరుమల మా జిల్లా లోనే ఉంది .
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలలో రెండు మా జిల్లా లోనే  ఉన్నాయి.
మా ఊరి ప్రక్కనే ఉన్న భీమవరం లోని గునుపూడి, లోని "సోమారామం" లో సోమేశ్వర స్వామి ,
పాలకొల్లు లోని క్షీరారామం లో ,క్షీరా రామ లింగేశ్వర స్వామి కొలువైఉన్నారు.
పెనుగొండ లో, వైశ్యుల ఆరాధ్యదేవత అయిన కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంతో  ప్రసిద్ధి చెందింది ,
చివరిగా ఒక మాట, నాన్ వెజ్ పచ్చళ్ళ కు  భీమవరం పెట్టింది పేరు,