నేనూ బ్లాగర్నేనా?



 ఇట్లా  తెలుగులో కూడా బ్లాగ్లు ఉంటాయని కొన్ని నెలల క్రితమే ఈనాడు వారి తెలుగువెలుగు పుస్తకం ద్వారా తెలుసుకొని అపుడపుడు చూడడం మొదలుపెట్టాను .ముందుగా  తెలుగువేలుగుకు ధన్యవాదములు .సరిగ్గా నెల క్రితం నుండి వ్యాఖ్యలు వ్రాయడం ప్రారంభించా.నా వ్యాఖ్యలకు జవాబులు కూడా వస్తుంటే చాలా ఉత్సాహంగా అన్పించింది.మొదట్లో అందరికీ ఇల్లాగే ఉంటుందా?
నా వ్యాఖ్యకు జవాబిస్తూ ,వనజవనమాలి గారు ఇట్లా అన్నారు."మీరు కూడా మీకు తోచినది వ్రాస్తూ ఉండండి."ఆవిడ ప్రేరణ, మా అబ్బాయి సహకారం తో వ్రాయడం మొదలు పెట్టాను.మొదట్లో మావారు నీ బ్లాగ్ ఎవరు చూస్తారు?అన్నారు"ఎవరూ చూడక పోయినా పర్వాలేదు,నేను డైరీ వ్రాకుంటున్నాను," అసుకుంటాను, అన్నాను. ఇపుడు .నేను కీ బోర్డు తో కుస్తీలు పడుతుంటే ,పాపం  భోజనం తనే వడ్డించుకొని తింటున్నారు .అంతే కాదండీ,నాలుగు రోజులుగా నా బ్లాగ్ చూస్తున్నారు కూడా.
ఎప్పటి కైనా కూడలి లోకి అడుగుపెట్టాలి. అప్పుడే నేను బ్లాగర్ అయినట్టు.ఇదండీ నా బ్లాగాయణం .