రాయకుండా ఉండలేకపోతున్నాను
.
కొంత కాలం కిందటి వరకూ యుక్తవయసు లోకి వచ్చిన తరువాత అమ్మాయిలకు తలి తండ్రులు భద్రతా విషయం లో జాగ్రత్తలు, చెప్పేవారు, కాని ఇప్పటి పరిస్తితి ,ఏమిటి?5,6 సంవత్సరాల పిల్లల్ని, ప్రక్కింటికి ఆడుకోవడానికి ,పంపించడానికి ,కూడా ఆలోచించాల్సిన ,పరిస్తితి, ఏర్పడుతోంది.
డిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత, ఈ 5నెలల్లొ, దినపత్రికల్లో ,నిత్యం అలాంటి , వార్త
ఒకటి,తప్పనిసరి. ఒక రోజు భాదిత బాలిక ,కు ఆపరేషన్ చేసి,కొన్ని వస్తువులు, బయటకు తీసారని, చదువుతూ, ఉంటె, కళ్ళు వెంబడి, నీళ్ళు, వచ్చాయి. పేపర్ చేతిలోకి, తీసికొంటూ, ఈ రోజు ఎన్ని కేసులో ,అనుకోవాల్సిన, పరిస్తితి.
ఇవి జరగడం ఇపుడే ఎక్కువ అయిందా? లేక జరిగిన ప్రతీ దుస్సంఘటనఇపుడు
,వెలుగు చూస్తుందా? భాదితు లందరూ పసిమొగ్గలు. నిందితులలో చాలామంది నిరక్షరాస్య యువత.
వీరి లో ఎట్లా మార్పు వస్తుంది?
మనం చేయగలిగినధల్ల ఒక్కటే. పిల్లల్ని సాధ్యమైనంతవరకు ఒంటరిగా వదలకపోవడం,వారి వారి వయసులను బట్టి వారికి ,ఎవరితో ఎట్లా మెలగాలో నేర్పించాలి.
ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఆశిద్దాం. నాగపూర్ లో' పెళ్లి లో ఆరేళ్ళ పాప పై
జరిగిన అత్యాచారం' వార్త చదివి, భాధతో వ్రాయకుండా ఉండలేక పోతున్నాను.