సోయా బొబ్బర్ల కూర.


సోయా బొబ్బర్లు కూర:
కావలసినపదార్దములు:
:
సోయా గింజలు:50 గ్రాములు
బొబ్బర్లు:100 గ్రాములు:
ఉల్లిపాయలు :2
టమాటో:1పెద్దది
అల్లం వెల్లుల్లి పేస్టు :చిన్న చెంచ
పచ్చిమిర్చి :2
ఇలాచి :1లవంగాలు :2
షాజీర :పావు స్పూన్ :
ఉప్పు, కారం,పసుపు:సరిపడినంత.
నూనె :2 స్పూన్స్
                          చేయు విధానము.
         సోయా గింజలు, బొబ్బర్లను కడిగి  6 లేదా 7అవర్స్  నానబెట్టుకోవాలి. నానిన గింజల్నికుక్కర్  లో నాలుగు విసిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లరేలోపు కళాయి లో నూనె వేడి చేసి ఇలాచి,లవంగాలు,షాజీర ,వేసి వేగిన తరువాత బాగా సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ,బాగా దోరగా వేయించాలి. తరువాత చీల్చిన పచ్చిమిర్చి ,తరిగిన టమాట ,అల్లంవెల్లుల్లి పేస్టు కాసేపు వేయించి,
ఉప్పు ,కారం, పసుపు. వేసి కాసేపు మూత పెట్టి మగ్గించాలి . 5నిముశాలు  తరువాత కొద్దిగా నీళ్ళు పోసి మరల మూత పెట్టాలి. ఎ లోపుగా ఉడికిన గింజలు తీసుకోని వాటిలోనుండి ,పెద్ద గరిటెడు గింజలు తీసుకోని బాగా మెత్తగా పేస్టు చేయాలి.ఈ పేస్టు ,ఉడికించిన గింజలు తీసుకెళ్ళి ,పొయ్యి మీద  ఉడుకుతున్న కూరలో ,వేసి బాగాకలపాలి.5నిముశాలు ఉడికిస్తే ఉప్పు, కారం, మసాలా ,అంతా
 కూరకు బాగా పడుతుంది. తరువాత కిందకు దింపి ఉప్పు, కారం, సరిచూసుకొని ,తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.పులుపు కావాలంటే నిమ్మరసం లేదా, ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే కూర రెడీ.
               సెనగలు కూరతింటే  గ్యాస్ అని భయపడే వారికి  ఈ కూర, చక్కని ప్రత్యామ్నాయము. ఇది
చపాతీ,పూరి, ఫుల్క ,ల్లోకి బావుంటుంది.
బోనస్:ఉదయం చేసిన కూర మిగిలితే సాయంత్రమ చాట్ చేసుకోవచ్చు. ఉడికించి మెత్తగా మెదిపిన ,బంగాళాదుంప కలిపి, కూర వేడిచేసి,సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమిర, వేసి, బాగా ,మెదిపి, నిమ్మ రసం  పిండి ,కొద్దిగా, చాట్ మసాల చల్లితే చాట్ రెడీ. దీని ముందు, బండి మీద చాట్ బలాదూర్.