తనదాకా వస్తే కానీ ఏదీ తెలియదు .అంటారు.నిజమే. పెద్దలు .అనుభవంతో చెప్పిన మాటలు .అక్షర సత్యాలని మనం పెద్దవాళ్ళమైతేగానీ తెలియదు .ఇక్కడ।నా అనుభవమేంటంటే,ఈఇంటర్నెట్,బ్లాగుల గురించి తెలియని రోజుల్లో ,మా పిల్లలు ఆకంప్యూటర్ల ముందు కూచుని। అంతంత సేపు ఏం చేస్తారబ్బా?అనుకొనేదాన్ని.ఇప్పుడు నేనూ ఇందులో కి ప్రవేశించడం తెలిసిన తరవాత ,కాస్త సమయందొరికితే చాలు ఇక ట్యాబ్లెట్ చేతికి తీసుకొంటే సమయమే తెలియదు ,కొత్త బిచ్చగాడు పొద్దు।ఎరగడన్నట్లుగా ఇంక అదేలోకం.ఇంట్లో పనులు ఆగిపోయేంతగా.ఈ మధ్య ఎక్కడో చదివాను,ఎంత తక్కువ సేపు కూర్చుంటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతారట.కాలక్షేపం కోసమో పొట్టకూటి కోసమో పగలంతా ఇంకాఅది।చాలదన్నట్టు రాత్రుళ్ళు కూడా వాటి ముందు గడిపేసే వాళ్ళు కాస్తఆలోచంచాల్సిన విషయమే మరి.మన మీద మనకే నియంత్రణ ఉండాలి మరి.