కావలసిన పదార్దములు:
జొన్నపిండి 4 గ్లాసులు
మినపప్పు 1 గ్లాసు
వాము 2 పెద్ద చెంచ
తెల్లనువ్వులు 4 చెంచాలు
వెన్న 2 చెంచాలు
నీళ్ళు సరిపడా
నూనె వేయించడానికి సరిపడినంత
ఉప్పు రుచికి సరిపడినంత
,చేయు విధానము
చేయు;;విధానము
మినపప్పును ఒక గంట ముందు నానబెట్టుకుని బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.ఉడికించిన మినపప్పును గరిటతో తిప్పుతూ బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు వేడి చేసి, వెన్న, వాము, నువ్వులు,ఉప్పు ఒక చెంచ, కారం వేసి దాంట్లోనే జొన్నపిండి ఉడికించిన మినప పిండి వేసి అవసరమయితే కాసిని నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. గట్టిగ ముద్దలా కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలో పెట్టుకొని కాగుతున్న నూనె లో జంతికలు వత్తుకోవాలి .మంట మధ్యస్తంగా పెట్టుకొని జంతికలు వేయించుకోవాలి.బియ్యప్పిండి జంతికల కన్నా ఇవి త్వరగా వేగిపోతాయి. జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మాడిపోయే అవకాశం ఉంది .పీచు,పోషకాలతో ,కూడిన కరకరలాడే జంతికలు సిద్ధం .