జోన్నదోసేలు




కావలసినవి;

మినపప్పు: 1గ్లాసు
తెల్లజోన్నలు:2గ్లాసులు
ఇద్లిరవ్వ;1గ్లాసు
మెంతులు:అరచెంచ
పచ్చిశనగపప్పు:రెండుచెంచాలు

తయారుచేయు విధానము;
మినపప్పు, జొన్నలు  శుభ్రంగా కడిగి విడివిడిగా  5 ఘంటలు  నానబెట్టుకోవాలి.జొన్నలు  పైన పొరతో ఉంటాయి కాబట్టి నానడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.సెనగపప్పు, మెంతులు కూడా జొన్నలతో పాటే నాiనబెట్టాలి.నానిన పప్పు జొన్నలు విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి.ఇడ్లి రవ్వ కూడా నానబెట్టుకొని ,శుభ్రంగా కడుక్కొని నీళ్ళు బాగా పిండుకొని , రుబ్బుకొన్న జొన్నపిండి,మినప్పింది  ఇద్లిరవ్వ మూడింటిని బాగా కలుపుకోవాలి.ఇపుడు దోస వేసుకోవడానికి పిండి సిద్ధం.
ఇడ్లీ రవ్వ వేయడం వలన ఇవి మామూలు దోసేల్లాగే పల్చగా కరకరలాడుతూ వస్తాయి..లేదంటే ఉల్లిపాయ,క్యారట్ తురుము,జీలకర్ర, తో ఉతప్పమ్ వేసుకున్న చాల బావుంటుంది.ఇక్కడ ఒక విషయం గమనించాలి.దీన్ని ఎక్కువ  మోతాదు లో రుబ్బుకొని నిలవ చేయడం కన్నా రెండు లేదా మూడు రోజుల్లో వాడేసుకుంటే బావుంటుంది. ఈపిండి తో దోసెలు అప్పటికప్పుడు వేసిన బాగానే ఉంటాయి. లేదా ఒక రాత్రి పులిసిన బాగానే ఉంటుంది.మీరు ప్రయత్నించి చుడండి.బియ్యం వాడకం తగ్గించాలనుకునేవారికి ఇది చక్కని పరిష్కారం.