హరిద్వార్

హరిద్వార్ ఇంకా హృషీకేశ్ లో ఇంకొన్ని ఫోటోలు.


read more →

మా పదిహేడురోజుల ప్రయాణం- 3

ఏమిటో! ఈ చార్ ధామ్ గురించి ,రెండు ముక్కలు వ్రాసికొని, నాలుగు ఫోటోలు పెట్టుకొంటే ఉభయతారకంగా ఉంటుందనుకొని మొదలుపెట్టానండీ!ఏవేవో సమస్యలు, అన్నీ తప్పులే.మా అబ్బాయి అందుబాటులో లేడు. ఉంటే నా కు సహాయం చేస్తాడు, ఫోన్ లో విసిగించడమెందుకులే అని ,ఆ తప్పుల తడకలే పోస్ట్ చేసేస్తున్నాను. ఈ పోస్ట్ లో ఫోటోస్ పెడదామని ప్రయత్నం, ఏమవుతుందో చూడాలి. read more →

మా పదిహేడు రోజుల ప్రయాణం -2

,,క్ృ.తర్వాత  ఆత్మారాముణ్ని శాంతింపచేసి,ఆశ్రమం వారు మాట్లాడి పెట్టిన వాహనాల్లో రిషికేశ్ బయలు దేరాం.హరిద్వార్ లో ఏ ప్రక్కకు వెళ్ళినా ,గంగే కన్పిస్తుంది.ఎక్కడికక్కడ వంతెనలు.రిషికేశ్ కు గంట లోపే ప్రయాణం .చాలాసేపు నది లాంటి కాలవ ప్రక్కనే ప్రయాణం ,చాలా బాగుంది .రిషీకేశ్ నిండా ఆశ్రమాలే.ఆశ్రమాలంటే పర్ణశాలలు కాదండోయ్!అన్నీ  పక్కా బిల్డింగులే.లక్ష్మణ్ ఝూలా అనే వంతెన మీదుగా గంగను దాటితే ,బోల్డన్ని ఆలయాలు.లక్ష్మణుడి గుడి , కృష్ణుడు గుడి,ఇంకా చాలా చాలా చూసాము.రిషికేశ్ లో rafting బాగా చేస్తారట.అన్నీ పర్వత ప్రాంతాలు అవడం మూలాన్న ఎక్కడికెళ్ళినా,కనీసం 20,30మెట్లు ఎక్కడం ,దిగడం తప్పనిసరి .
అక్కడే భోజనాలు చేసిన తర్వాత ,హరిద్వార్కు తిరుగుప్రయాణం.సాయంత్రానికి హరీకీ పౌరీ అనే ప్రదేశం చేరుకున్నాం,గంగాహారతి చూడటానికి.విపరీతమైన జనప్రవాహం.నాకైతే కాశీలో హారతి బావుంటుందన్పించింది.
హారతి అయిపోయిన తర్వాత , నెమ్మదిగా నడుస్తూ ,జనాలతో కిటకిటలాడుతున్న బజార్లు,షాపులు చూసుకుంటూ రూమ్ కు చేరుకున్నాం.

read more →

మా పదిహేడు రోజుల ప్రయాణం _1

దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్  రాష్ట్రం లో గల చార్ధామ్ యాత్ర  చేయాలని , మావారు, స్నేహితులు ,వాళ్ళ కుటుంబాల తో కలసి మొత్తం 17 మందిమి ఢిల్లీ వెళ్ళే తెలంగాణా ఎక్సప్రెస్ ఎక్కాము, సికింద్రాబాద్ స్టేషన్ లో.మర్నాడు ఉదయాన్నే 9_గంటలకు ఢిల్లీ లో ట్రైన్ దిగి ,సుమారు 5గంటలు వెయిటింగ్ హాల్లో నిరీక్షణ.8పైగానే acలు పనిచేస్తున్నా, విపరీతమైన రష్ కారణంగా ,ఢిల్లీ ఎండల్ని ఆ వెయిటింగ్ హాల్లో నే ఎంజాయ్ చేసేసాము.మాతో సహా అందరి దగ్గరా చాలా చాలా లగేజ్.కాలు కదపలేని పరిస్థితి .అతి కష్టం మీద అక్కడ కూర్చుని , మరికాస్త శ్రమతీసుకొని ఆ పద్మవ్యూహం లోంచి బైటపడి , డెహ్రాడూన్ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కాము, మధ్యాహ్నం 3గంటలకు.6గంటల ప్రయాణం తర్వాత ,రాత్రి9గంటలకు హరిద్వార్ లో దిగాము.స్టేషన్కు దగ్గరగా , గంగానది ప్రక్కనే ఉన్న చింతామణి ఆశ్రమం లో బస.ఆన్లైన్ లో ముందుగానే బుక్ చేశారు , హాయిగా గదుల్లో చేరిపోయాం.పదిహేడు రోజుల్లో ,మొదటి రెండు రోజులు ప్రయాణం చేసి హరిద్వార్ చేరుకున్నామన్నమాట.కొంచెం బోర్ గా ఉందాండీ?తరువాత టపాలో ఫోటోలు పెడతానులేండి.

read more →

'ముగ్ధ' బంతులు

మొదటి అంతస్తు లోని మా ఇంటి వరండాలో , కుండీలో పూసిన బంతుల్లాంటి బంతిపూలు.రోజుకు నాలుగైదు సార్లన్నా వాటివంక చూసి మురిసిపోతున్నామంటే నమ్మండి.

read more →

చాలా రోజుల తర్వాత ,

చాలా రోజులు కాదండీ! చాలా నెలలు అయ్యింది ,మిమ్మల్ని పలకరించి,అందుకే ఇలా వచ్చాను .మా స్వగ్రామంలో మేం కొత్తగా కట్టుకుని  ఉంటుం�న్న మా �ఇల్లు చూడండి ఈసారికి ,మిగతా సంగతులు మరో పోస్టు .

read more →

పునుగుపిల్లి 2

అది నాలుగు పాలచుక్కలు చప్పరించిన తర్వాత  హమ్మయ్య! అనుకున్నా. అప్పుడు మొదలైంది ఇంకో సందేహం ,దీన్ని కేండీ నుంచీ ,ఎండ నుంచీ కాపాడ్డంఎలా? ఎండ  తగలకుండా కుండీ పైన పాతరేకు మూతేసి, రెండు గంటలకొకసారి ,పాలూ నీళ్ళు ,పోసాను.మధ్యలో చీమల బెడద కాస్సేపు .
దానంతట అది కదలుతుందేమోనని చూశాను ,ఊహూ! ఏ మార్పూ లేదు.చీకటి పడిన తరువాత బైట వదిలేస్తే కుక్కలేమైనా లాక్కుపోతాయేమో?ఏం చేయాలో తోచలేదు.ఒకవేళ రాత్రి తల్లి వచ్చి వెతుక్కుంటుందేమోనని, అది ఎక్కడ కనబడిందో,అక్కడే పెట్టడం మంచిదని  కేండీ కంటపడకుండా  అట్టపెట్టె తీసుకుని , స్టోర్ రూం లోకి వెళ్ళి లైట్ వేసాం.తల్లి కోసం మేం చూస్తే ,దాని బ్రదర్స అండ్ సిస్టర్స ఇంకో మూడు కన్పించాయ్.అవి మూడూ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి .చకచకా తిరుగుతూ ,మమ్మల్ని చూసి కంగారుపడి వెళ్ళి పోడానికి దారులు వెతకసాగాయి.అవి వచ్చాయంటే ,ఖచ్చితంగా తల్లి కూడా వస్తుందిలే అని వెనక్కు వచ్చేసి తలుపు మూసేసాం.మిగతా  కథ మరోసారి .ఫోటోలో మూడూ కన్పిస్తున్నాయా మీకు?

read more →